అన్ని రంగాలలో ప్రభుత్వం విఫలం – ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల కిషోర్ ధ్వజం
హైదరాబాద్, అక్టోబర్ 14, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలను పరిష్కారించడంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు కన్వీనర్ నల్లెల్ల కిషోర్ డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లెల్ల కిషోర్ మాట్లాడుతూ... ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులుపడుతున్నారని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు సంబంధించి గత విద్యా...