కాంగ్రెస్ పాల‌న‌లో న‌ర‌క కూపాలుగా మారిన ప్ర‌భుత్వ ఆసుప‌త్రులు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జూన్ 4, అద్దం న్యూస్ :    అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌న్ని న‌ర‌క కూపాలుగా మారాయ‌ని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పిన్న‌మ‌నేని సాయిబాబా అన్నారు. బుధ‌వారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... గత 10 ఏళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం పట్ల సరైన ప్రాధాన్యత ఇవ్వక పోవడంతో రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కుంటుపడిందన్నారు. ప్ర‌స్తుత కాంగ్రెస్ పాల‌న‌లో కూడా పేరుకే ప్రభుత్వ ఆసుపత్రులు గాని వీటికంటే ధర్మాసుపత్రుల...