జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే – జర్నలిస్టుల ధర్నాలో ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 20, ( అద్దం న్యూస్ ) :    జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. జర్నలిస్టుల ఇళ్ళస్థలాల పోరాటానికి తన మద్దతు ఉంటుందని,ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. శుక్రవారం హైద‌రాబాద్‌ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో ఇండ్లు, ఇండ్ల స్థలాల సాధనకై గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ...