Addam News
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 5:13 am Posted by : Addam News

తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్ ( TISC ) ను ప్రారంభించిన ప్ర‌భుత్వం

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 5, ( అద్దం న్యూస్ ) :

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 సందర్భంగా ప్రభుత్వం తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్ ( TISC ) ను ప్రారంభించింది. TISC కింద ప్రారంభించిన ఈ ఛాలెంజ్.. కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు.. మన తెలంగాణను మనమే నిర్మించుకుందాం. ఇది, మన కోసం, మన రాష్ట్రం కోసం పని చేయాలనుకునే ప్రతి ఆవిష్కర్తకు ఆహ్వానం ఇచ్చింది. మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు మీ వినూత్న ఆలోచనలతో పరిష్కారాలను కనుగొని ముందుకు రావాల‌ని.. కలిసి ఆవిష్కరిద్దాం. అవకాశాలను సృష్టిద్దాం ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. తెలంగాణను ప్రతి ఒక్కరికీ మరింత మెరుగైన నివాస ప్రదేశంగా తీర్చిదిద్దుకుందామ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. మనమంతా కలిసి రేపటి తెలంగాణను నిర్మిద్దామ‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఈ నెల 20వ తేదీలోపు tisc.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం పేర్కొంది.