ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురుకుల విద్యార్థులే బలి – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా
ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురుకుల విద్యార్థులే బలి – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, డిసెంబర్ 16, అద్దం న్యూస్ : ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురుకుల విద్యార్థులే బలి అవుతున్నారని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రభుత్వ పాఠశాలల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై తెలుగు దేశం పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని, ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ అని అన్నారు. మంగళవారం హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు...