క్రీడారంగానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహించాలి – డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : క్రీడలు యువతలో స్నేహాభావాన్ని పెంపొదిస్తాయని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ అన్నారు. భగత్‌సింగ్‌ స్మారక యువజనోత్సవాల సందర్భంగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ముషీరాబాద్ జోన్ భరత్‌న‌గ‌ర్‌లో వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో క్రీడాపోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒకవైపు విద్యార్థి యువజనుల హక్కులకై ఉద్యమాలు, పోరాటాలు చేస్తూనే మరోవైపు యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను, నైపుణ్యాన్ని వెలికితీసేందుకు, మానసిక ఉల్లాసాన్ని...