సామాన్యుడి నడ్డి విరుస్తున్న ప్రభుత్వాలు – టీడీపీ నగర నాయకుడు నల్లెల్ల కిషోర్ ధ్వజం
వంటింట్లో మండుతున్న ధరల సెగ సామాన్యుడి నడ్డి విరుస్తున్న ప్రభుత్వాలు – టీడీపీ నగర నాయకుడు నల్లెల్ల కిషోర్ ధ్వజం హైదరాబాద్, మార్చి 9, అద్దం న్యూస్ : అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని సాకుగా చూపి, నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతూ సామాన్య, మధ్య తరగతి ప్రజల పొట్ట కొడుతున్న ప్రభుత్వ తీరుపై తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ జిల్లా నాయకుడు నల్లెల్ల కిషోర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ దోమలగూడలోని నగర టిడిపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో...