Addam News
Newspaper Banner
Date of Publish : 12 March 2025, 3:35 pm Posted by : Addam News

కాంగ్రెస్‌ కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

 కాంగ్రెస్‌ కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం

కాంగ్రెస్ తల్లిని, రాహుల్ గాంధీ తండ్రిని మూడేళ్ల తర్వాత గాంధీ భవన్‌కు పార్సిల్ చేస్తాం

     – ఎంఎల్ఏ, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం ఉందని ఎంఎల్ఏ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో కెటిఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ తల్లిని, రాహుల్ గాంధీ తండ్రిని మూడేళ్ల తర్వాత గాంధీ భవన్‌కు పార్సిల్ చేస్తామన్నారు. 20 శాతం కమీషన్‌ తప్ప.. విజన్‌ లేని రేవంత్ ప్రభుత్వం ఇది అని ధ్వజమెత్తారు. ఢిల్లీకి మూటలు పంపేందుకే ఈ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నో విజన్.. ఓన్లీ కమిషన్..

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజన్ లేదన్నారు. గవర్నర్‌ ప్రసంగంలో కొత్త విషయాలు చెబుతారనుకున్నాం.. రైతులకు భరోసా ఇస్తారని భావించాం కానీ అలాంటిదేమీ లేదన్నారు. 20 నుంచి 30 శాతానికి మించి రైతులకు రుణమాఫీ జరగలేదు.. కానీ రుణమాఫీ పూర్తి చేసినట్లు గవర్నర్‌తో పచ్చి అబద్ధాలు చెప్పించారని విమర్శించారు.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png