హైదరాబాద్, అక్టోబర్ 4, ( అద్దం న్యూస్ ) : అలయ్- బలయ్ ఫౌండేషన్ చైర్ పర్సన్ బండారు విజయలక్ష్మి నేతృత్వంలో తెలంగాణ గవర్నర్ సతీమణి జానకి శుక్లా ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తెలంగాణ లోక్ భవన్లో కలిసి అలయ్- బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10 వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్ ముషీరాబాద్లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు మహిళల ఐక్యత, సామాజిక సామరస్యాన్ని చాటిచెప్పడమే ఈ వేడుకల ప్రధాన ఉద్దేశమని ప్రతినిధులు వారికి తెలియజేసారు. ఆహ్వానానికి గవర్నర్ సతీమణి జానకి శుక్లా సానుకూలంగా స్పందించినట్లు బండారు విజయలక్ష్మి తెలిపారు. గవర్నర్ సతీమణి జానకి శుక్లా ను కలిసిన ప్రతినిధి బృందంలో కేతినేని సరళ, అమృత, ఇందిరా సింగ్, మంత్రి కళావతి, ఏ.పావని తదితరులున్నారు.
