బ‌తుక‌మ్మ వేడుక‌ల‌కు రావాల‌ని గ‌వ‌ర్న‌ర్ స‌తీమ‌ణి కి ఆహ్వానం

హైద‌రాబాద్‌, అక్టోబర్ 4, ( అద్దం న్యూస్ ) :   అల‌య్‌- బ‌ల‌య్ ఫౌండేషన్ చైర్ పర్సన్ బండారు విజయలక్ష్మి నేతృత్వంలో తెలంగాణ గవర్నర్ సతీమణి జానకి శుక్లా ను ఆదివారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ లోక్ భవన్‌లో కలిసి అల‌య్‌- బ‌ల‌య్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10 వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్ ముషీరాబాద్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు మహిళల ఐక్యత, సామాజిక సామరస్యాన్ని...