నల్లకుంట, అక్టోబర్ 13, ( అద్దం న్యూస్ ) : దసరా సందర్భంగా బతుకమ్మ వేడుకలు మంగళవారం అంబర్పేట నియోజకవర్గం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో ఘనంగా జరిగాయి. రంగురంగుల పూలతో అంకరించిన అందమైన బతుకమ్మలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డిఎంఓ డాక్టర్.రిషిత హాజరై ఆసుపత్రి ఉద్యోగులతో కలిసి బతుకమ్మ పాటలకు అనుగుణంగా బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో జ్యోతి, ఉమాదేవి, కీర్తి, నాగలక్ష్మీ, ధనలక్ష్మీ, స్వప్న, భాగ్య, ఆర్తి, లావణ్య, తేజ, రెబెక తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ చుట్టూ తిరుగుతూ తెలంగాణ సాంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లతో లయబద్ధంగా బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా డిఎంఓ డాక్టర్.రిషిత మాట్లాడుతూ… నిత్యం ప్రాణాపాయంలో ఉన్న రోగులకు వైద్యం అందించే ఒత్తిడిలో ఉండే వైద్య సిబ్బందికి, ఈ వేడుకలు మానసిక ప్రశాంతతను, ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు. అందరూ ఒక కుటుంబంలా కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నామని తెలిపారు.
