Addam News
Newspaper Banner
Date of Publish : 11 August 2025, 1:58 am Posted by : Addam News

ఘ‌నంగా శ్రీ ఉప్పలమ్మ తల్లి శ్రావణ మాసం బోనాలు – హాజ‌రైన బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

ఘ‌నంగా శ్రీ ఉప్పలమ్మ తల్లి శ్రావణ మాసం బోనాలు

– హాజ‌రైన బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

హైదరాబాద్, ఆగ‌స్టు 10, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లోని శ్రీ ల‌క్ష్మీ ఉప్ప‌లమ్మ త‌ల్లి దేవాల‌యంలో శ్రావ‌ణ మాసం బోనాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల నిర్వాహకులు వై.సంజీవ్ రెడ్డి అతిథులను స్వాగతించి వినయ్ కుమార్‌ను సన్మానించి, అమ్మ వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బోనాల వేడుకల్లో బీజేపీ డివిజన్ అద్యక్షుడు వి.నవీన్, బీజేపీ నాయకులు సాయి కుమార్, జ్ఞానేశ్వర్, ఆలయ కమిటీ సభ్యులు ప్రసన్న లక్ష్మి, పద్మావతి, రాధ, పవన్, అనిల్ కుమార్, కుమార్, సోనమ్, స్థానికులు, నాయకులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png