వైభవంగా శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
హైదరాబాద్, జూన్ 6, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మండప పునఃపూజలు, కళా హోమాలు, స్పర్శ హోమాలు, అంగ హోమాలు, మహాపూర్ణాహుతి, కుంభాభిషేకం, గోదృష్టి, నేత్రోన్మేలనం, మహాకుంభం, అమ్మవారి దర్శనం, మండప ఉద్వాసన, వేదా శీర్వచనం తదితర పూజలు జరిగాయి. ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి నగర...