తార్నాక, సెప్టెంబర్ 26, ( అద్దం న్యూస్ ) : తార్నాక క్రాస్‌రోడ్‌లో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను కొన్నే సంపత్ రజక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చూపిన ధైర్యం, తెగువను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తార్నాక రజక సంఘం నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు.![]()