Addam News
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 5:44 am Posted by : Addam News

ముషీరాబాద్‌లో ఘ‌నంగా రక్షా బంధ‌న్‌

ముషీరాబాద్‌లో ఘ‌నంగా రక్షా బంధ‌న్‌

ముషీరాబాద్, ఆగ‌స్టు 28, ( అద్దం న్యూస్ ) :   ముషీరాబాద్‌లో శుక్ర‌వారం ర‌క్షా బంధ‌న్ పండుగ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మదేశి రాజేందర్ కు ఆయ‌న సోదరీమణులు రాజలక్ష్మి, రాజకుమారి, రోజమణి త‌దిత‌రులు రాఖీలు క‌ట్టారు. ఈ సంద‌ర్భంగా బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మదేశి రాజేందర్ మాట్లాడుతూ… రాఖీ అనేది స్త్రీల రక్షణకు, వారి గౌరవానికి మనం ఇచ్చే అత్యున్నత ప్రాధాన్యతను గుర్తు చేస్తుందన్నారు. సమాజంలో ప్రతి మహిళను సోదరీభావంతో చూడాలనే భావనను ఇది పెంపొందిస్తుంద‌ని తెలిపారు. ఈ పండుగ కుల, మత, ప్రాంతీయ భేదాలను మరచి మనుషులందరినీ ఒకేతాటిపై నిలబెడుతుందని పేర్కొన్నారు. ఈ పండుగ రోజున మన కుటుంబ సభ్యుల బంధాలను బలపరుచుకోవడంతో పాటు, మన చుట్టూ ఉన్న సమాజంలో ప్రతి మహిళకు రక్షణగా, అండగా నిలుస్తామని ప్రతిజ్ఞ చేద్దామ‌న్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png