పివి నరసింహారావుకు ఘనంగా నివాళులు
పివి నరసింహారావుకు ఘనంగా నివాళులు హైదరాబాద్, జూన్ 28, ( అద్దం న్యూస్ ) : భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పివి.నరసింహారావు 105 వ జయంతి ఆదివారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లోని పివి ఘాట్ వద్ద ఘనంగా జరిగింది. ఈ స్మారక కార్యక్రమంలో పివి కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేతకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి పివి గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్...