ఇళ్ళస్థలాల సాధనకై ఈ నెల 20న గ్రేటర్ జర్నలిస్టుల మహా ధర్నా –హలో జర్నలిస్ట్-ఛలో ఇందిరాపార్క్

హైద‌రాబాద్‌, ( అద్దం న్యూస్ ) :    గ్రేటర్ జర్నలిస్టులకు ఇళ్ళస్థలాల కేటాయింపులో కొనసాగుతున్న ప్రభుత్వ వివక్ష, నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ లో జర్నలిస్టుల మహాధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి శ్రీనివాస్ లు తెలిపారు. ఇళ్ళస్థలాల కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ  నిరాశ - నిస్పృహలకు లోనైన గ్రేటర్ జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్...