Addam News
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 3:10 pm Posted by : Addam News

సుందరయ్య పార్క్‌లో పచ్చదనాన్ని కాపాడాలి – హెచ్‌సిఎఫ్‌

హైదరాబాద్, న‌వంబ‌ర్ 17, అద్దం న్యూస్ :     గతంలో ఉన్నచోటే పిల్లల ఆట వస్తువుల నిర్మాణాన్ని కొనసాగించాలని పార్కులో పచ్చదనాన్ని కాపాడాలని హైదరాబాద్‌ సిటిజన్స్‌ ఫోరం (హెచ్‌సిఎఫ్ ) అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శి వీరయ్య, ఉపాధ్యక్షుడు భవాని శంకర్, సహాయ కార్యదర్శులు రమేష్, శంకరయ్య తదితరులు సోమ‌వారం ప్రజావాణిలో జిహెచ్‌ఎంసి కమీషనర్ ఆర్‌వి.కర్ణన్ ను కలిసి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. అనంత‌రం వారు మాట్లాడుతూ… సుందరయ్య పార్క్‌లో వారం రోజుల నుండి పచ్చదనానిచ్చే గ్రీనరీని తొలగించి, పిల్లల ఆట వస్తువులు నిర్మించేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు పనులు ప్రారంభించారన్నారు. సుందరమైన పార్క్‌ను ధ్వంసం చేస్తున్నారన్నారు. దీంతో సుందరయ్య పార్క్‌ రూపు రేఖలు మారిపోనున్నాయని, వెంటనే పార్క్‌లో తవ్వకాలను ఆపివేయాలని, గ్రీనరీని కాపాడాలని కోరారు. ఇప్పటికే పార్క్‌లో పిల్లల ఆట స్థలం, షటిల్‌ కోర్టు, ఓపెన్‌ జిమ్‌, ఆఫీసు బిల్డింగ్‌ లకు ప్రత్యేక స్థలాలు ఉన్నాయని, పిల్లల ఆట వస్తువుల నిర్మాణానికి ఇప్పటికే వేరే స్థలం కేటాయించబడి ఉందన్నారు. అక్కడ కొంగలు రెట్టలు వేస్తున్నాయని, సుందరమైన పచ్చదనాన్ని ఇచ్చే పార్కు స్థలంలో పిల్లల ఆట వస్తువుల నిర్మాణానికి పనులు చేపట్టారన్నారు. పిట్టలు రెట్టలు వేయకుండా షెడ్డు నిర్మాణం చేసి పిల్లల ఆట వస్తువుల నిర్మాణాన్ని చేయవచ్చ‌న్నారు.

             లారీల పార్కింగ్‌ల వలన పార్క్‌ గ్రీనరీ ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. సుందరయ్య పార్క్‌ చక్కటి వాతావరణాన్ని కల్పిస్తూ వాకర్స్‌ నడవడానికి వాకింగ్‌ ట్రాక్‌, స్వచ్ఛ‌మైన‌ గాలిని పీల్చుకోవడానికి పచ్చని చెట్లు, జిమ్‌, పచ్చని గడ్డితో ఉంద‌ని, పెద్దలు, పిల్లలు, వాకర్స్‌ పార్క్‌కు ప్రతి రోజు దాదాపుగా 2000 మంది వస్తున్నారన్నారు. పిల్లల ఆట వస్తువులు విరిగిపోయి రెండు సంవత్సరాల పైగా అయిందన్నారు. జిహెచ్‌ఎంసి అధికారులకు అనేక సార్లు కంప్లైంట్స్‌ చేసినా ఇప్పటికీ సరియైన మరమ్మతులు చేయలేదన్నారు. సుందరయ్య పార్కులో గ్రీనరీని కాపాడాలని, పిల్లల ఆట వస్తువులను గతంలో ఉన్న పిల్లల ఆట స్థలంలోనే ఏర్పాటు చేయాలని కోరారు.



https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png