లిబియాలో భారతీయ కుటుంబం కిడ్నాప్‌..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఆఫ్రికా దేశం లిబియాలో ఒక భారతీయ కుటుంబం కిడ్నాప్‌నకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. కిడ్నాప్‌ చేసిన దుండగులు బాధితులను విడిచిపెట్టడానికి గాను రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు గుజరాత్ పోలీసులు ధృవీకరించారు. కిడ్నాప్‌కు గురైన కుటుంబం గుజరాత్‌ రాష్ట్రంలోని మెహసాణా జిల్లాకు చెందినదిగా గుర్తించారు. మెహసాణా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమాన్షు సోలంకి తెలిపిన వివరాల ప్రకారం, కిస్మత్‌సింగ్‌ చావ్డా, ఆయన భార్య హీనాబెన్‌, వారి కూతురు దేవాన్షి ఈ దుర్ఘటనకు గురయ్యారు. పోర్చుగల్‌లో స్థిరపడ్డ కిస్మత్‌...