గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి – చేనేత, పద్మశాలి, బీసీ, విద్యా, వైద్య రంగాల ప్రతినిధుల విజ్ఞప్తి

అంబ‌ర్‌పేట‌, అక్టోబర్ 29, ( అద్దం న్యూస్ ) :     బీసీ హక్కుల సాధన, సామాజిక న్యాయం, విద్యారంగ అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న గుజ్జ సత్యం ( గుజ్జ సత్యనారాయణ ) కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని వివిధ సామాజిక వర్గాలు, చేనేత సంఘాలు, పద్మశాలి సమాజ ప్రతినిధులు, బీసీ సంఘాలు, విద్యా, వైద్య రంగాలకు చెందిన ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన సేవలు, అనుభవాన్ని గుర్తించి రాజ్యాంగ నిబంధనలు, సంబంధిత అర్హతలు,...