గుజ్జ సత్యంకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి –మధిర బీసీల ఐక్యవేదిక ఏకగ్రీవ తీర్మానం
మధిర, అక్టోబర్ 27, ( అద్దం న్యూస్ ) : బీసీ ఉద్యమ నాయకుడు గుజ్జ సత్యంకు తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని మధిర నియోజకవర్గ బీసీల ఐక్యవేదిక ఏకగ్రీవంగా తీర్మానించింది. బీసీల హక్కుల సాధన, చేనేత కార్మికుల సంక్షేమం, విద్యా, వైద్య రంగాల్లో ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఎమ్మెల్సీ పదవికి ఆయన పేరును ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని వివిధ బీసీ కుల సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. మధిరలోని స్థానిక క్రియేషన్ క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన...