తార్నాక, అక్టోబర్ 8, ( అద్దం న్యూస్ ) :
ప్రధాన ఎన్నికల కమిషనర్ ( సీఈసీ ) జ్ఞానేశ్‌కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ చలో లోక్‌భవన్ ’ ర్యాలీలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతె శోభన్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్‌భవన్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మోతె శోభన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలన్నారు. ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. మోతె శ్రీలత శోభన్‌రెడ్డి మాట్లాడుతూ… ఓటు హక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం చేపట్టే ప్రజా ఉద్యమాల్లో తాము భాగస్వాములుగా ఉంటామని పేర్కొన్నారు.