Addam News
Newspaper Banner
Date of Publish : 13 April 2025, 2:42 am Posted by : Addam News

గాంధీన‌గ‌ర్‌లో ఘ‌నంగా హ‌నుమాన్ జ‌యంతి

 

హైదరాబాద్, అద్దం న్యూస్ :     ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో హ‌నుమాన్ జ‌యంతి కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. బివైఎం గాంధీనగర్ అధ్యక్షుడు జి.అరుణ్ కుమార్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వీర హనుమాన్ శోభాయాత్ర స్వాగత వేదికకు గాంధీన‌గ‌ర్, క‌వాడిగూడ డివిజ‌న్ల‌ కార్పొరేటర్లు ఎ.పావని, ర‌చ‌న శ్రీ, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ క‌న్వీన‌ర్ వినయ్ కుమార్ లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు హనుమాన్ శోభా యాత్ర కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు వెంకటేష్, సత్తి రెడ్డి, శివ కుమార్, మదన్మోహన్, సాయి కుమార్, ఆనంద్ రావు, జ్ఞానేశ్వర్, సాయి సంతోష్, సాయి తేజ, కార్తీక్, అభిషేక్, సన్నీ యాదవ్, భాను, శివ, వరుణ్ కుమార్, రాజు, రాఘవ, బీజేపీ నేతలు, కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png