వివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో వైభ‌వంగా హ‌నుమాన్ జ‌యంతి

  హైదరాబాద్, అద్దం న్యూస్ :   శ్రీ హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌లు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో ఘ‌నంగా జ‌రిగాయి. ఇందులో భాగంగా డివిజ‌న్‌లోని వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో హ‌నుమాన్ జ‌యంతి వైభ‌వంగా జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా ఘ‌టాభిషేకం, పంచామృత‌, వివిధ ఫ‌ల ర‌స అభిషేకం, ఆకుపూజ‌, వ‌డ‌మాల పూజ‌లు త‌దిత‌ర పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌స్వామి వ్ర‌తం నిర్వ‌హించారు. ఈ పూజ‌లో ఆల‌య రెనోవేష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ జాన‌కి సుధాక‌ర్ పాల్గొన్నారు. ఈ పూజ‌ల‌కు ముఖ్య అతిథులుగా ముషీరాబాద్...