Addam News
Newspaper Banner
Date of Publish : 02 April 2026, 10:07 pm Posted by : Addam News

వివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌లు

వివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో
భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌లు

హైదరాబాద్, ఏప్రిల్ 2, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివేక్‌న‌గ‌ర్‌లోని శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో గురువారం హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌లు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో మ‌న్యుసూక్త‌పూర్వ‌క అష్టోత్త‌ర శ‌త‌క‌ల‌శ ఘ‌టాభిషేకం, పంచామృత‌, వివిధ ఫ‌ల ర‌స అభిషేకం, ఆకు పూజ‌, వ‌డ‌మాల పూజ‌లు, మంత్ర‌పుష్పం, తీర్థ ప్ర‌సాద త‌దిత‌ర పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. అలాగే సింధూర అభిషేకాన్ని వైభ‌వంగా నిర్వ‌హించారు. సాయంత్రం జ‌రిగిన‌ సామూహిక స‌త్య‌నారాయ‌ణ వ్ర‌తంలో భ‌క్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు, కుటుంబ‌స‌భ్యులు, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్ లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు ఆల‌యంలో ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఆలయ రెనోవేష‌న్ క‌మిటీ చైర్మన్ జానకి సుధాకర్, ఆలయ ఈవో మాచర్ల దేవనాథంతో క‌లిసి పూజ‌ల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా టిపిసిసి అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్ దంప‌తులు ఆంజ‌నేయ‌స్వామి వారికి ప‌ట్టు వ్ర‌స్తాల‌ను స‌మ‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ రెనోవేష‌న్ క‌మిటీ సభ్యులు శ్యామ్ కుమార్ ముదిరాజ్, పద్మావతి, నిర్మల, రామకృష్ణ, వెంకటరావు, హరీష్, శిశు కుమార్, ఆలయ ముఖ్య అర్చకులు బుగ్గ లక్ష్మీపతి శర్మ, భ‌క్తులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png