సికింద్రాబాద్, సెప్టెంబర్ 19, ( అద్దం న్యూస్ ) : సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మోకాలు శస్త్రచికిత్స చేయించిన ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను గత రెండు రోజులుగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ముఠా గోపాల్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జయసింహ, ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండ శ్రీధర్‌రెడ్డి, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పులిగిల్ల శ్రీధర్ చారి, కరికే కిరణ్ కుమార్, శంకర్ ముదిరాజ్, పోతుల శ్రీకాంత్, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గుప్తా, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png