Addam News
Newspaper Banner
Date of Publish : 23 March 2025, 3:52 am Posted by : Addam News

పేడూరి కృష్ణ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ

అంబ‌ర్‌పేట్, అద్దం న్యూస్ : అంబ‌ర్‌పేట్ నియోజ‌క‌వ‌ర్గం బాగ్ అంబర్‌పేట డివిజన్ బిజెపి ఉపాధ్యక్షుడు పేడూరి కృష్ణ గౌడ్ ఇటీవల అనారోగ్యానికి కారణంతో మృతి చెందారు. విష‌యం తెలుసుకున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శనివారం బాగ్ అంబర్‌పేట కుమ్మరువాడిలోని కృష్ణ గౌడ్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కృష్ణ గౌడ్ తో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని దత్తాత్రేయ గుర్తు చేసుకున్నారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ చేపట్టే ప్రతి ఒక్క కార్యక్రమంలో చురుకైన కార్యకర్తగా గత 40 సంవత్సరాలుగా కృష్ణ గౌడ్ పాల్గొని తమ సేవలను అందించారని కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో కృష్ణ గౌడ్ సతీమణి లావణ్య, కుమారుడు సాయినాథ్ గౌడ్, కుమార్తె నందిని, కుటుంబ సభ్యులు ఇందిరా, లలితానంద రాజ్ గౌడ్, బిజెపి డివిజన్ అధ్యక్షుడు చుక్క జగన్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ దత్తు ముదిరాజ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి కోడూరు సురేష్, చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి రోహిత్ నంద రాజ్ గౌడ్, అఖిలేష్ గౌడ్, రావుల రోహిత్, సాయి, బంటి పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png