Addam News
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 1:26 pm Posted by : Addam News

పట్టభద్రుల ఓటరు నమోదుకు హెల్ప్ డెస్క్ • నవంబర్ 6 వరకు ఉచిత నమోదు సేవలు

తార్నాక, అక్టోబర్ 25, ( అద్దం న్యూస్ ) :   

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు చేసుకునేందుకు తార్నాకలోని నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి బండ శివారెడ్డి సహకారం అందించారు. నవంబర్ 6 వరకు కొనసాగనున్న హెల్ప్ డెస్క్ సేవలను అర్హులైన పట్టభద్రులందరూ సద్వినియోగం చేసుకుని ఓటరుగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి జలంధర్ రెడ్డి, తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి, బండ చంద్రారెడ్డి,వేణు యాదవ్, బండ శివారెడ్డి, వీరన్న, రాము వర్మ, సయ్యద్ ఖలీద్ షా, రాజ్ కుమార్, టెంపుల్ సాయి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.