పట్టభద్రుల ఓటరు నమోదుకు హెల్ప్ డెస్క్ • నవంబర్ 6 వరకు ఉచిత నమోదు సేవలు
తార్నాక, అక్టోబర్ 25, ( అద్దం న్యూస్ ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు చేసుకునేందుకు తార్నాకలోని నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి బండ శివారెడ్డి సహకారం అందించారు. నవంబర్ 6 వరకు కొనసాగనున్న హెల్ప్ డెస్క్ సేవలను అర్హులైన పట్టభద్రులందరూ సద్వినియోగం చేసుకుని ఓటరుగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో నాగార్జున...