ఫిరాయింపుదారులకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ » టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్
హైదరాబాద్, సెప్టెంబర్ 28, ( అద్దం న్యూస్ ) : ఫిరాయింపుదారులకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ ముఖ్య నాయకుల సమావేశం సోమవారం హైదరాబాద్ దోమలగూడలోని ఆ పార్టీ నగర కార్యాలయంలో జరిగింది. టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్...