కార్పొరేటర్ ఎ.పావని ఆదేశాలతో హైటెన్షన్ వైర్లను క్రమబద్ధీకరించాం  – బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

హైదరాబాద్, ఆగస్టు 24, అద్దం న్యూస్ :  గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని ఆదేశాలతో ప్రమాదాలు నివారించడానికి హైటెన్షన్ వైర్లను క్రమబద్ధీకరించామని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ మాల బస్తీ మెయిన్ రోడ్డు వద్ద గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న హైటెన్షన్ ఎలక్ట్రికల్ వైర్లను తొలగించి హెచ్ టి బంచ్ కేబుల్ ను ఏర్పాటు చేయాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ కు బస్తివాసులు కోరారు. ఇందుకు స్పందించిన కార్పొరేటర్ పావని విద్యుత్...