హైదరాబాద్, సెప్టెంబర్ 23, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద విషాద ఘటన ఈ నెల 23వ తేదీన తెల్లవారు జామున చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జనంలో భాగంగా ఎన్‌టిఆర్ మార్గ్‌లో విధుల్లో ఉన్న కొత్తగూడెం టూ టౌన్ ఎస్‌ఐ కె.వెంకన్న ( 55 ) ను గుర్తు తెలియని వ్యక్తి బైక్ తో ఢీకొట్టి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకన్న ఉన్నతాధికారుల సూచనల మేరకు కొత్తగూడెంలోని ఆయన నివాసానికి వెళ్లాడు. శరీరం కలతగా ఉందనడంతో కుటుంబసభ్యులు వెంకన్న ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం వెంకన్న మృతి చెందాడు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వెంకన్నను ఢీకొట్టిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.