నగరంలో ఘనంగా హోలి సంబురాలు
నగరంలో ఘనంగా హోలి సంబురాలు రంగులు చల్లుకున్న చిన్నారులు ఇందిరాపార్క్‌లో జరిగిన హోలి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, అద్దం న్యూస్ : హోలి సంబురాలు రాష్ట్రంతో పాటు హైదరాబాద్ నగరంలో వాడ వాడలా ఘనంగా జరిగాయి. హోలి పండుగను పురస్కరించుకుని గురువారం రాత్రి కాముని దహనం చేశారు.స్నేహితులు, చిన్నారులు, చిన్నా పెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకున్నారు. హోలి పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. హైదరాబాద్ నగరంలోని ఇందిరాపార్క్‌లో హోలి సంబురాలు ఘనంగా జరిగాయి. ఇందిరాపార్క్ వాకర్ అసోసియేషన్...