Addam News
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 3:57 pm Posted by : Addam News

వాట‌ర్‌వ‌ర్క్స్ అధికారుల‌కు స‌న్మానం

వాట‌ర్‌వ‌ర్క్స్ అధికారుల‌కు స‌న్మానం

హైదరాబాద్, జ‌న‌వ‌రి 22, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ డివిజ‌న్ ప‌ఠాన్‌బ‌స్తీలో రూ.22.75 ల‌క్ష‌ల నిధుల‌తో డ్రైనేజి పైప్‌లైన్ ప‌నుల‌ను చేప‌ట్టినందుకుగాను నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు జావీద్ ఖాన్ ఆధ్వ‌ర్యంలో చిల‌క‌ల‌గూడ‌ వాట‌ర్ వ‌ర్క్ అధికారుల‌కు స‌న్మానం జ‌రిగింది. చిల‌క‌ల‌గూడ వాట‌ర్‌వ‌ర్క్స్ డిజిఎం మోహ‌న్ రాజ్‌, మేనేజ‌ర్ సురేష్‌ల‌కు జావీద్ ఖాన్ పూల‌దండ‌లేసి, శాలువాలు క‌ప్పి ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా డిజిఎం మోహ‌న్‌రాజ్ మాట్లాడుతూ… ప‌ఠాన్‌బ‌స్తీలో చాలా ఏళ్లుగా డ్రైనేజీ ఓవ‌ర్ ఫ్లో స‌మ‌స్య ఉంద‌ని, ప్ర‌స్తుతం ఆ స‌మ‌స్య తొల‌గిపోతుంద‌న్నారు. ఇప్ప‌టికే నూత‌న డ్రైనేజి పైప్‌లైన్ల ఏర్పాటు ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌న్నారు. ఈ సంద‌ర్భంగా జావీద్ ఖాన్ మాట్లాడుతూ… ప‌ఠాన్‌బ‌స్తీలో పైప్‌లైన్ల ప‌నులు దాదాపు 50 శాతం పూర్తి అయ్యాయ‌న్నారు. అందుకు స‌హ‌క‌రించిన వాట‌ర్‌వ‌ర్క్స్ అధికారుల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ఇమ్రాన్ ఖాన్‌, మున్నా ఖాన్‌, జాఫ‌ర్ త‌దిత‌రులున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png