ఘోరం.. అన్నదమ్ముల దారుణహత్య
ఘోరం.. అన్నదమ్ముల దారుణహత్య అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ : పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న జంట హత్యల ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దుర్గి మండలం, అడిగొప్పల గ్రామంలో అన్నదమ్ములను ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘోరం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. మృతులుగా హనుమంతు (అన్న), శ్రీరాంమూర్తి (తమ్ముడు) గా పోలీసులు గుర్తించారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థులు వీరిపై వేటకొడవళ్లతో అత్యంత కిరాతకంగా దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనతో...