హౌస్ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
తార్నాక, నవంబర్ 14, ( అద్దం న్యూస్ ) : కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్, రాహుల్ గాంధీ పర్యటనకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన తనను, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్టు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తీవ్రంగా ఖండించారు. శనివారం ఉదయం ఆరు గంటల నుంచే తన నివాసం వద్ద పోలీసులు మోహరించి బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ సమ్మిట్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే కార్యక్రమం కాదని, భారత...