హౌస్‌ఫెడ్ అధికారుల సేవలు అభినందనీయం
హైదరాబాద్, అక్టోబర్ 1, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ హౌస్‌ఫెడ్ చైర్మన్ కె.నవనీతరావు, జాయింట్ రిజిస్ట్రార్ ఏ. పూర్ణచంద్రరావు బాధ్యతల నుంచి పదవీ విరమణ సందర్భంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హౌస్‌ఫెడ్ ఉద్యోగులు, సిబ్బంది ఆధ్వర్యంలో అభినందన, సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హౌస్‌ఫెడ్ ఎండీ లక్ష్మీబాయి హాజరై కె.నవనీతరావు, ఏ.పూర్ణచంద్రరావులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మీబాయి మాట్లాడుతూ... హౌస్‌ఫెడ్‌లో బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ఉద్యోగులు, సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ...