సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు యాజమాన్య నిర్లక్ష్యమే – మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందించాలి – ఆమ్ ఆద్మి పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
హైదరాబాద్, జులై 1, అద్దం న్యూస్ : యాజమాన్య నిర్లక్ష్యం తోనే పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి 36 మంది కార్మికులు మరణించారని ఆమ్ ఆద్మి పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. ఫ్యాక్టరీలో ప్రమాదం జరగడం బాధాకరం అని అని అన్నారు. శ్రమజీవులు పిట్టల్లా రాలి పోయిన ఘటనే అందుకు నిదర్శనం అని, మృతుల కుటుంబాలకు ఆప్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వడం తోపాటు...