Addam News
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 7:06 am Posted by : Addam News

ఆర్టీసీ బస్సు ఢీకొని భార్యాభర్తలు మృతి

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన మలక్‌పేట్‌ (Malakpet) పోలీసు స్టేషన్ పరిధి వాహేద్ నగర్ ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు, వెంకటమ్మ దంపతులు ఇటీవల దిల్‌సుఖ్‌నగర్‌లోని కొత్తపేటలో ఉంటున్న తమ కుమార్తె వద్దకు వచ్చారు. ఈక్రమంలో గురువారం సాయంత్రం బైక్‌పై వారిద్దరూ ట్యాంక్‌బండ్ చూసేందుకు బయలుదేరారు.

మూసారాంబాగ్ హైటెక్ మోటార్స్‌ సమీపంలో, వెనుక నుంచి వేగంగా వచ్చిన దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో దంపతులు రోడ్డుపై పడిపోయారు. బస్సు వెనుక టైరు వారిపై నుంచి వెళ్లడంతో తిరుపతిరావు, వెంకటమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న మలక్‌పేట్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png