Addam News
Newspaper Banner
Date of Publish : 19 August 2025, 3:26 am Posted by : Addam News

నులిపురుగుల నివారణకు పరిశుభ్రతను పాటించాలి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

నులిపురుగుల నివారణకు పరిశుభ్రతను పాటించాలి

– గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, ఆగ‌స్టు 18, అద్దం న్యూస్ :     నులిపురుగుల నివారణకు పరిశుభ్రతను పాటించాలని, వైద్యులు సూచించిన మందుల‌ను వాడాల‌ని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. సోమ‌వారం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లిలోని ఆంధ్ర మ‌హా విద్యాల‌యం పాఠ‌శాల‌లో నులిపురుగుల నివార‌ణ మందుల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ హాజ‌రై పేద విద్యార్థినీ, విద్యార్థుల‌కు అల్బెండజోల్, మెబెండజోల్ మందులను అందచేసారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… పిల్లల ఆరోగ్యవంతమైన జీవితంలో నులిపురుగుల నివారణ ఎంతో అవసరమని, నులిపురుగుల నివారణకు పరిశుభ్రత పాటించడం, ఆహారం, నీటిని శుభ్రంగా ఉంచుకోవాల‌న్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకరి నులిపురుగుల నివారణకై వైద్యుల సలహా మేరకు మందులు వాడడం ముఖ్యం అని కార్పొరేటర్ పావ‌ని వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీకాంత్, పి.నర్సింగ్ రావు, శివ కుమార్, సత్యేంధర్, ఏఎన్ఎం భవాని, ఆశా వర్కర్లు లక్ష్మి, సుచిత్ర, మాధవి, పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png