పదేళ్ల పాటు ప్రాజెక్టులను పడావు పెట్టకుండా పూర్తి చేసి ఉంటే ఈ రోజు నీటి కష్టాలు ఉండేవి కావు – సీఎం రేవంత్ రెడ్డి
సిద్దిపేట, ( అద్దం న్యూస్ ) : కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, పాలమూరు – రంగారెడ్డి, నల్గొండ జిల్లాకు ఎస్ఎల్బీసీ, ఖమ్మం జిల్లాకు సీతారామసాగర్ లాంటి ప్రాజెక్టులు గత పదేళ్లపాటు పడావు పెట్టకుండా పూర్తి చేసి ఉంటే ఈరోజు నీటి కష్టాలు ఉండేవి కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి రోజున ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఇందిరమ్మ జీవిత...