పాలకులు, అధికారులు వ్యాపారులైతే ప్రజల సంక్షేమం గాలిలో దీపం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబ
హైదరాబాద్, ఏప్రిల్ 2 ( అద్దం న్యూస్ ) : పాలకులు, అధికారులు వ్యాపారులైతే ప్రజల సంక్షేమం గాలిలో దీపమవుతుందని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబ అన్నారు. బుధవారం దోమలగూడలోని నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు నల్లెల్ల కిషోర్, పి.బాల్‌రాజ్ గౌడ్, నాయకులు ఎస్.ప్రకాష్. కిరణ్, శుక్రవేది తదితరులతో కలిసి సాయిబాబా మాట్లాడుతూ... రాష్ట్రంలో పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వమే టార్గెట్లు పెట్టి...