Addam News
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 6:15 am Posted by : Addam News

నన్ను ఆశీర్వదిస్తే రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోడీతో పోరాడుత – టిఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

పాలమూరు రైతుల కష్టాలు కనబడతలేవా ముఖ్యమంత్రి గారూ ?
నేను బహుజనుల బాణాన్ని
యువకుల యుద్ద నినాదాన్ని
– టిఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

కొడంగ‌ల్‌, సెప్టెంబర్ 20, ( అద్దం న్యూస్ ) :   నన్ను ఆశీర్వదిస్తే రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోడీతో పోరాడుత తెలంగాణ ర‌క్ష‌ణ సేన ( టిఆర్ఎస్ ) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ ముఖ్యమంత్రి బలవంతుడినని దురహంకారంతో వీర్రవీగుతున్నాడని క‌విత మండిప‌డ్డారు. బలవంతమైన సర్పం చలి చీమల చేతిలో చిక్కి చచ్చినట్లే ఆయనకు పరాభావం తప్పదన్నారు. పాలమూరు రైతుల కష్టాలు కనబడతలేవా ముఖ్యమంత్రి గారూ ? అని క‌విత ప్ర‌శ్నించారు. నేను కాంగ్రెస్ వదిలిన బాణాన్ని అని బీఆర్ఎస్ అంటోందని, ముఖ్యమంత్రి అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ల ఆస్తుల లెక్కను నాతో కలిపి చెప్పి నేను బీఆర్ఎస్ వదిలిన బాణాన్ని అంటున్నాడ‌ని.. ఇంకొంత మంది తెలిసి తెలియక నేను బీజేపీ బాణాన్ని అంటున్నారన్నారు. నేను బహుజనుల బాణాన్ని, యువజనుల యుద్ద నినాదాన్ని.. అంబేడ్కర్ వాదాన్ని నేను. పూలే గారి ఆత్మగౌరవాన్ని నినాదాన్ని నేను అని, సాయిత్రి భాయ్ ఆశయాలతో నీటారుగా నిలబడి మగమహారాజులకు ఛాలెంజ్ విసురుతున్న వీరవనితను నేను అని క‌విత అన్నారు. నేను బహుజనుల బాణాన్ని, యువకుల యుద్ద నినాదాన్ని అని అన్నారు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ ఆదివారం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ… పాలమూరులో నదులున్నా ప్రాజెక్టులు పూర్తి కాలేదని.. ఓపిక నశించి జూరాల రెగ్యులేటర్లు పలగొట్టి నీళ్లు తెచ్చుకునే దుస్థితి తెచ్చారని.. యూరియా లేదు, కరెంటు లేదు, రైతు భరోసా లేదన్నారు. మక్కల కుప్ప మీద రైతుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టదా ? అని ప్ర‌శ్నించారు. కొడంగల్ గడ్డ మీద నుంచి హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా స్పందించకపోతే రైతన్నలే మిమ్మల్ని గద్దె దించుతారన్నారు. జురాల నుంచి నీటిని తీసుకొని పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు నీళ్లిస్తా.. లేదంటే నా పేరు మార్చుకుంటా అని స‌వాల్ చేశారు. 2009 లో టీడీపీ తో పొత్తులో భాగంగా కోస్గీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో కలిసి వచ్చాను… ఇప్పుడు వాళ్లిద్దరూ కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నారని, కచ్చితంగా కోస్లీ, కొడంగల్, తెలంగాణ ప్రజల దీవెనలతో నేను కూడా ఈ రాష్ట్రాన్ని నడిపిస్తానని విశ్వాసంతో ఉన్నానన్నారు.

కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉండగా ఇంకో పార్టీ ఎందుకంటూ మా అక్కాచెల్లెలు ఆలోచన చేస్తున్నారన్నారు. తెలంగాణలోని ప్రతి బిడ్డను చదివించే బాధ్యత మీరు గెలిపిస్తే నేను తీసుకుంటాన‌ని, తెలంగాణలో విద్య పరిస్థితి దారుణంగా తయారైంది. గురుకుల్లాలో ఫుడ్ పాజయిన్ అవుతోందన్నారు. పాలిటెక్నిక్ విద్యను తీసేస్తారంట. విదేశాలకు వెళ్లి కూలీ పనిచేసుకోవాలని ముఖ్యమంత్రి చెబుతాడన్నారు. ఈ ముఖ్యమంత్రి యూత్ ను నమ్మోద్దు అంటున్నాడు.. ఆయన బూతులను నమ్మాలా ? అని ఎద్దేవా చేశారు. మక్తల్ లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తే ఓ టీచర పై, రైతులపై రౌడీ షీట్ ఓపెన్ చేశారని… నర్సింహుల్ అనే రైతును గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో పోలీసులు కొట్టి చంపారని విమ‌ర్శించారు. ముదిరాజ్, ముస్లింలు, నేతన్నలు, గీతన్నలు వాళ్ల జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం ఉండాల్సిందే అని.. మాదిగ‌, మాల సోదరులకు కూడా వారికి సమాజంలో గౌరవం దక్కటం లేదన్నారు. ఈ ముఖ్యమంత్రికి ఇంకా రెండేళ్లే సమయం ఉంది… ఇప్పటికైనా ఇక్కడ పరిస్థితిని మార్చటం పై దృష్టి పెట్టాలని, రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడన్నారు.

మహబూబ్‌న‌గ‌ర్‌లో కాంగ్రెస్ కు 13 సీట్లు ఇస్తే…ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి, ఇందిరమ్మ ఇళ్ల దందా చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు అడుగుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు, ఉద్యోగులకు, ప్రజలకు ఇచ్చిన మాట తప్పిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికార దురహంకారం పెరిగిపోయిందన్నారు. అట్టడుగు వర్గాల ప్రజలను హింసించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇలాంటి అహంకారపూరిత ఘటనలకు ముగింపు పలకాలంటే సామాజిక తెలంగాణ రావాలని.. అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలన్నారు. మేము అధికారంలోకి వస్తే జురాల నుంచి నీళ్లు తీసుకోని ఇబ్రహీంపట్నం వరకు పది లక్షల ఎకరాలు నీళ్లు ఇస్తా…లేదంటే నా పేరు మార్చుకుంటా అని క‌విత స్ప‌ష్టం చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png