ఐక్యతకు మారుపేరు ఇఫ్తార్ విందు – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
హైదరాబాద్, అద్దం న్యూస్ : ఐక్యతకు మారుపేరు ఇఫ్తార్ విందు అని ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ ఫాతిమా బేగం మసీదులో బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఇఫ్తార్ విందును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫాతిమా బేగం మసీదు అధ్యక్షుడు...