Addam News
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 3:01 am Posted by : Addam News

అక్రమ నిర్మాణాలను తొలగించాలి – నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్

అక్రమ నిర్మాణాలను తొలగించాలి
– నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్

హైదరాబాద్, ఏప్రిల్ 4, అద్దం న్యూస్ :   అక్రమ నిర్మాణాలను తొలగించాల‌ని నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ ( NCA ) ప్రతినిథి బృందం కోరింది. ఈ మేర‌కు శ‌నివారం జిహెచ్‌ఎంసి డిప్యూటీ కమిషనర్‌ మారుతి దివాకర్ ను క‌లిసి నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ (NCA) ప్రతినిథి బృందం వినతి పత్రం ఇచ్చి, చర్చించడం జరిగింది. ఎన్‌సిఏ ప్రధాన కార్యదర్శి మోహన్‌ నాయుడు, కోశాధికారి శ్రీనివాస్‌రావు, నాయకులు రితేష్‌, సత్యనారాయణ, వీరయ్య, శివకుమార్‌, కిరణ్‌, సుశాంత్ లు మాట్లాడారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్‌లో పాత రామలయం ఎదురుగా ఇ.నెం.2-1-260లో 108 గజాలలో ఇటీవల జి+4 నిర్మాణం చేప‌ట్టార‌ని, చూట్టు ప్రక్కల ఇండ్లకు కనీసం ఎలాంటి ఖాలీ స్థలం వదులకుండ నిర్మాణం చేపట్టార‌న్నారు. ఇంటి నిర్మాణం పై చుట్టుప్రక్కల వారు అనేక మంది అభ్యంతరాలు తెలిపిన, ఫిర్యాదులు ఇచ్చినా  పట్టించుకోలేదన్నారు. చిన్న ఇరుకు రోడ్డులో జి+2 పర్మిషన్‌ తీసుకొని, జి+4 కింద్ర పార్కింగ్‌ కూడా వదలకుండా 8 పోర్ష‌న్స్‌ను క‌ట్టి అన్ని అద్దెకు ఇచ్చారన్నారు. దానితో కాలనీలో ఒకటి రెండు కుటుంబాలు ఉండవలసిన దగ్గర, 8 కుటుంబలతో వాహనాల పార్కింగ్‌, ఇతర సమస్యలు కూడా ప్రారంభమ‌య్యాయ‌ని పేర్కొన్నారు.

8 నెలల క్రితం జిహెచ్‌ఎంసి అధికారులు వచ్చి అనుమతులు రద్దు చేస్తున్నట్లు ఆపివేశారన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయాని జిహెచ్‌ఎంసి అధికారులు బ్యానర్‌ను కూడా క‌ట్టార‌న్నారు. బ్యానర్‌ కట్టినా ఒక్కరోజు కూడా పనులు ఆగకుండా రెగ్యులర్‌గా మూడు నెలలు జ‌రిగాయ‌న్నారు. ఇప్పుడు అదనంగా చుట్టుప్రక్కల వారికి కనీస సమాచారం లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా 4 వ అంతస్తుపై 9 మీటర్ల ఎత్తులో మూడు సెల్‌ టవర్స్‌ నిర్మిస్తున్నారని విమ‌ర్శించారు. దయచేసి అక్రమణ కటడ్డాలను తొలగించి… చుట్టుప‌క్క‌ల ఇండ్లకు, కాలనీలో పార్కింగ్‌ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు. ఇందుకు స్పందించిన జిహెచ్‌ఎంసి డిప్యూటీ కమిషనర్‌ మారుతి దివాకర్ అక్ర‌మ క‌ట్ట‌డాల పై త‌గు చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హామినిచ్చారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png