అక్రమంగా అరెస్టు చేసిన డివైఎఫ్ఐ నాయకులను విడుదల చేయాలి

  హైదరాబాద్, ఏప్రిల్ 01, అద్దం న్యూస్ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సీటీకి చెందిన 400 ఎకరాల భూములని కార్పొరేట్‌ సంస్థలకు వేలం వేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెన‌క్కు తీసుకోవాల‌ని డివైఎఫ్ఐ రాష్ట్ర క‌మిటీ డిమాండ్ చేసింది. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్యతిరేకిస్తూ గత పది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. అదే విధంగా మంగ‌ళ‌వారం హెచ్‌సియు వద్ద ధ‌ర్నా నిర్వ‌హించిన‌ డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు హష్మీ బాబును పోలీసులు అరెస్టు చేశారు....