సిసి రోడ్ల ప్యాచ్ వ‌ర్క్ పున‌రుద్ద‌ర‌ణ ప‌నుల‌ను త‌క్ష‌ణ‌మే చేప‌ట్టండి – డిప్యూటీ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పుష్ప‌ల‌త‌కు టిడిపి నాయ‌కుల విన‌తి

ముషీరాబాద్‌, న‌వంబ‌ర్ 17, ( అద్దం న్యూస్ ) :     హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని డివిజ‌న్ల‌ల్లో నిలిచిపోయిన సిసి రోడ్డు ప్యాచ్ వ‌ర్క్ పున‌రుద్ద‌ర‌ణ ప‌నుల‌ను త‌క్ష‌ణ‌మే చేప‌ట్టాల‌ని, రోడ్ల పై నిల్వ ఉన్న మ‌ట్టికుప్ప‌ల‌ను తొల‌గించాల‌ని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కుడు, మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్ గౌడ్ కోరారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం జిహెచ్ఎంసి క‌వాడిగూడ స‌ర్కిల్‌– 40 డిప్యూటీ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పుష్ప‌ల‌త‌ను క‌లిసి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. అనంత‌రం ప‌లుస...