విద్యుత్ వినియోగదారులపై ట్రూ-అప్ ఛార్జీల భారం మోపడం దారుణం – తెలుగుదేశం సికింద్రాబాద్ పార్లమెంట్‌ కన్వీనర్ నల్లెల్ల కిషోర్ తీవ్ర ఆగ్రహం

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 4, ( అద్దం న్యూస్ ) :     విద్యుత్ వినియోగదారులపై ట్రూ-అప్ ఛార్జీల భారం మోపడం దారుణమ‌ని తెలుగుదేశం సికింద్రాబాద్ పార్లమెంట్‌ కన్వీనర్ నల్లెల్ల కిషోర్ తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమే అని అన్నారు. హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో బుధ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో కిషోర్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై మరోసారి భారీ భారం మోపేందుకు రంగం సిద్ధమైందన్నారు. గత రెండు సంవత్సరాల ( 2022-23, 2023-24...