Addam News
Newspaper Banner
Date of Publish : 27 April 2025, 10:11 am Posted by : Addam News

ఆకట్టుకున్న కూచిపూడి నాట్య హేళ

 

 ఆకట్టుకున్న కూచిపూడి నాట్య హేళ

                       ఆకట్టుకున్న కూచిపూడి నాట్య హేళ

సిటీ కల్చరల్, ఏప్రిల్ 26, ( అద్దం న్యూస్ ) :   సత్య కీర్తి నిత్యధామం కూచిపూడి నృత్య కళాశాల గురు బాలాజీ కుమార్ ఆధ్వర్యంలో కూచిపూడి నాట్య హేళ అనే శీర్షికతో నాల్గవ వార్షికోత్సవ వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఆంజనేయనగర్ నృత్యధామం వ్యవస్థాపకులు నాట్యాచారులు దొడ్డ బాలాజీ కుమార్ నృత్య శిక్షణలో మలచబడిన యువ నర్తకులు రవీంద్ర భారతి 108 మంది విద్యార్థులు తమ అందాల‌ రవళితో ప్రేక్షకులను సమ్మోహ పరిచారు. గణేష్ వందనం, జతి స్వరం, అన్నమయ్య, త్యాగరాజ కీర్తనలతో మొదలు పెట్టి శివాష్టకం ఆనందతాండవం, అష్టలక్ష్మి స్తోత్రం, మహిషాసుర మర్దిని వంటి క్లిష్టమైన నృత్యాంశాలను చేసి ప్రేక్షకులను తన్మయపరిచారు. ప్రముఖ నాట్య గురువులు డాక్ట‌ర్‌.వనజ ఉదయ్, సభ్యత స్కూల్ కరస్పాండెంట్ లక్ష్మీ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కళాకారులను ప్రతిభను మెచ్చుకొని వారికి ఆశీస్సులు అందించారు. చక్కని శిక్షను అందించిన గురు బాలాజీ కుమార్ ను అభినందిచారు. విద్యార్థులతో పాటు గురు బాలాజీ కుమార్ కూతురు కీర్తనతో కలిసి నర్తించడం ఎంతో అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. నృత్య కళాశాల నుండి ఇప్పటికీ 500 మంది విద్యార్థులు శిక్షణ పూర్తి చేసుకొని అ 200 పైగా విద్యార్థులు సర్టిఫికెట్ డిప్లమా కోర్సులు పూర్తి చేసుకోవడం సంతోషదాయకమన్నారు. దేశ విదేశాలలో కూడా దాదాపుగా 500 ప్రదర్శన లను ప్రదర్శించడం అభినందనీయమన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png