ఆజామాబాద్ బస్తీలో క‌లుషిత‌, లో ప్రెష‌ర్ నీటి సమస్యను పరిష్కరించాలి – సిఐటియు, ఐద్వా

హైదరాబాద్, జూన్ 25, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం విఎస్‌టి ఆజామాబాద్ బ‌స్తీలో మంచినీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ బుధ‌వారం చిల‌క‌ల‌గూడ వాట‌ర్ వ‌ర్క్స్ కార్యాల‌యం వ‌ద్ద సిఐటియు, ఐద్వా ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు నగర కార్యదర్శి ఎం.వెంకటేష్ మాట్లాడుతూ...ఆజామాబాద్ బస్తీలో గత సంవత్సర కాలం నుండి మంచినీరు కలుషితంగా వస్తున్నాయని, కలుషిత మంచినీరు తాగటం మూలంగా బస్తీ వాసులు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. మంచినీటి లో ప్రెజర్ స‌ర‌ఫ‌రా కావ‌డంతో బ‌స్తీవాసులు రోజు వారి...